మాకు ఎటువంటి సమాచారం లేదు: ఎన్డీయేలో వైసీపీ చేరికపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
- టీడీపీకి, వైసీపీకీ సమాన దూరం
- మొదటి నుంచి ఇది మా పార్టీ విధానం
- మోదీ, అమిత్‌షాతో జగన్ చర్చలు పాలనా సంబంధమైనవే
ఈరోజు ఆయన ఓ టీవీ చానెల్ ప్రతినిధితో మాట్లాడుతూ ఎన్డీయే ప్రభుత్వంలో వైసీపీ చేరుతోందన్న అంశంపై రాష్ట్ర నాయకత్వానికి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేశారు. నిజం చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరం పాటించాలన్నది తమ పార్టీ విధానమని, అందువల్ల ఇటువంటి వన్నీ ఊహాగానాలేనని ఆయన తేల్చిపారేశారు. రాష్ట్రంలో విపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు పెరిగాయని ఆరోపించారు.