Corona Virus: కరోనా మహమ్మారి మెడలు వంచిన కేరళ వైద్యులు!

Kerala doctors wins corona virus
  • ఇటీవలే చైనా నుంచి తిరిగొచ్చిన ముగ్గురు కేరళీయులు
  • కరోనా సోకినట్టు గుర్తింపు
  • ప్రత్యేక చికిత్స అందించిన కేరళ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
  • మాయమైన కరోనా లక్షణాలు
ఆసియా అగ్రరాజ్యం చైనాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ (కొవిడ్-19) ఇప్పటికే వెయ్యికి పైగా ప్రాణాలను బలిగొంది. వేలమంది కరోనా బారినపడి ఆసుపత్రులపాలయ్యారు. అయితే, కేరళ వైద్యులు కరోనా మహమ్మారిని లొంగదీశారు. కేరళ వైద్యుల చికిత్స కారణంగా ముగ్గురు కరోనా బాధితులు పూర్తి స్వస్థత పొందారు. చైనాలోని వుహాన్ లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు.

వారిని కేరళలో ప్రత్యేక వార్డులకు తరలించారు. వైద్య,ఆరోగ్యశాఖకు చెందిన వైద్య నిపుణులు ఈ ముగ్గురు విద్యార్థులకు చికిత్స అందించారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం వారిలో కరోనా వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినట్టు గుర్తించారు. దీనిపట్ల కేరళ ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి థామస్ ఐజాక్ స్పందిస్తూ, గతంలో నిపా వైరస్ ను జయించామని పేర్కొన్నారు. ఇప్పుడు కరోనా వైరస్ పై పోరాటంలోనూ కేరళ విజయం సాధించిందని తెలిపారు.
Corona Virus
Kerala
China
Wuhan

More Telugu News