Ummareddy: అటువంటి పరిస్థితి చంద్రబాబుకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి: ఉమ్మారెడ్డి జోస్యం

Ummareddy prophecy Such a situation seems to be coming to Chandrababu
  • జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతారని నాడు బాబు ఎద్దేవా చేశారు
  • మాజీ పీఎస్ డొల్ల కంపెనీల వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు?
  • ఇందుకు చంద్రబాబు సమాధానం చెప్పాలి? 
ప్రతి సోమవారం తాను పోలవరం వెళతానని, జగన్ మాత్రం ప్రతి శుక్రవారం కోర్టుకు వెళతారని నాడు చంద్రబాబు ఎద్దేవా చేస్తూ మాట్లాడారని, ఈ రోజున అలాంటి పరిస్థితులు ఇప్పుడు బాబుకు వచ్చే సూచనలు కన్పిస్తున్నాయని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జోస్యం చెప్పారు.

ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అబద్ధాలు ఎంత కాలమో దాగవని, ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు బయటపెట్టాలని సూచించారు. తన మాజీ పీఎస్ డొల్ల కంపెనీల వ్యవహారం వెనుక ఎవరెవరు ఉన్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు తెలియకుండా తన వ్యక్తిగత సహాయకుడు ఈ కంపెనీలను నడిపాడని కనుక బాబు భావిస్తే ఆ మాటనే ప్రజల ముందుకు వచ్చి చెప్పాలని అన్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో సీబీఐ ఈ రాష్ట్రానికి రావడానికి వీల్లేదని, ఐటీ సోదాలు జరగాల్సిన అవసరం లేదని ఆంక్షలు పెట్టారని గుర్తుచేశారు. తాజా పరిణామాల గురించి ఆలోచిస్తుంటే ఆనాడే ఈ సోదాలు జరిగితే ఈ బండారం బయటపడేదని ప్రజలు అనుకుంటున్నారని విమర్శించారు. ఐటీ సోదాల్లో రెండు వేల కోట్లకు పైగా బయటపడ్డాయి గానీ, ఇంకా ఎక్కువగానే అక్రమాలు జరిగి ఉంటాయని ప్రజలు అనుమానిస్తున్నారని అన్నారు.
Ummareddy
YSRCP
Chandrababu
Telugudesam
Jagan
cm

More Telugu News