Devineni Uma: ఏపీలో ‘ఆర్థిక ఎమర్జెన్సీ’ రాబోతోంది: దేవినేని ఉమ జోస్యం

Devineni Predicts Financial Emergency will take place in AP
  • ఏపీకి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల అప్పులు దాటిపోయాయి
  • ఈ ఏడాది కాలంలో సుమారు రూ.60 వేల కోట్ల అప్పులు చేయబోతోంది
  • రాబోయే నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలూ ఇవ్వలేని పరిస్థితి  
పోలీసుల విచారణ ఆలస్యమైతే నేరస్తులు తప్పించుకుంటారంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నేరస్తులు తప్పించుకుంటున్నారు కనుకనే జగన్ అంత నిర్భయంగా మాట్లాడారని, ‘కేసుల గురించి దర్యాప్తుల గురించి ఎంత బాగా చెబుతున్నారు కబుర్లు!’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ పై ఉన్న కేసులు తరుముకొస్తున్నా, ఆయన మాత్రం కోర్టుకు హాజరుకావడం లేదని విమర్శించారు.

ఏపీకి ఇప్పటికే నలభై రెండు వేల కోట్ల రూపాయల అప్పులు దాటిపోయాయని, ఇక ఈ సంవత్సర కాలంలో సుమారు అరవై వేల కోట్ల రూపాయల అప్పులను ప్రభుత్వం చేయబోతోందని జోస్యం చెప్పారు. రాబోయే రెండు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి రానుందని, అలాగే, పెన్షన్లు కూడా ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితిలోకి రాష్ట్రాన్ని జగన్ తీసుకెళతారని, కొన్ని నెలల్లోనే ఏపీలో ‘ఆర్థిక ఎమర్జెన్సీ’ రాబోతోందని జోస్యం చెప్పారు.
Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News