Vijayasai Reddy: జల్లెడ పడితే పది లక్షల కోట్లయినా దొరుకుతాయి: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy comments on IT raids
  • పీఎస్ ఇళ్లను సోదా చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడింది
  • చంద్రబాబు నెట్ వర్క్ చూసి ముంబై కార్పొరేట్ సంస్థలు బిత్తరపోయాయట
  • ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమే
ఏపీలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులపై జరిగిన ఐటీ దాడులపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పీఎస్ ఇళ్లను సోదాలు చేస్తేనే వేల కోట్ల బ్లాక్ మనీ బయటపడిందని... బినామీలు, పెంచి పోషించిన కాంట్రాక్టు సంస్థలను జల్లెడ పడితే రూ. 10 లక్షల కోట్లయినా దొరుకుతాయని అన్నారు. 'చంద్రబాబు నెట్ వర్క్ చూసి ముంబై కార్పొరేట్ సంస్థలన్నీ బిత్తరపోయాయట' అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు బయటకొచ్చింది ఉల్లిపాయపై పొర మాత్రమేనని అన్నారు.

చంద్రబాబు, ఆయన బానిస మీడియా ఇంతగా కుళ్లుకుంటున్నారంటే తిన్నది ఒంటబట్టడం లేదని అర్థమవుతోందని విజయసాయి దెప్పిపొడిచారు. కంటి నిండా నిద్ర పోవడం లేదని తెలిసిపోతోందని అన్నారు. దోపిడీ రోజులు పోయాయని... నిజాయతీ, విశ్వసనీయతల విలువేమిటో ప్రజలు గ్రహించారని చెప్పారు. పచ్చ తెరల లోకం నుంచి బయటకు రావాలని అన్నారు. మా కోడి కూస్తేనే తెల్లారుతుందనుకుంటే ఎలాగని ప్రశ్నించారు.
Vijayasai Reddy
YSRCP
Chandrababu
PS
IT Raids
Telugudesam

More Telugu News