valentine day: వాలెంటైన్స్ డే: ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ హైదరాబాద్‌లో ఫిర్యాదు

help lovers on valentine day
  • ఈ రోజు 'వాలెంటైన్స్ డే'
  • పెళ్లి చేస్తారేమోనని ప్రేమికుల భయం
  • హెచ్చార్సీకి క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఫిర్యాదు
వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా ప్రేమ జంటలు పండుగ చేసుకుంటున్నాయి. అయితే, 'వాలెంటైన్స్ డే'ని గ్రాండ్‌గా జరుపుకోవాలనుకుంటోన్న తెలంగాణ ప్రేమ జంటలకు భజరంగ్‌దళ్ సభ్యుల భయం పట్టుకుంది. ప్రేమలో మునిగితేలుతోన్న తమను పట్టుకుని, పెళ్లి చేస్తారేమోనని వణికిపోతున్నారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ  మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఓ పిటిషన్‌ దాఖలైంది.

తెలంగాణలో ప్రేమికుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆల్‌ ఇండియా దళిత, క్రైస్తవ సంఘాల సమాఖ్య, క్రైస్తవ ధర్మ ప్రచార పరిరక్షణ సమితి ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రేమించుకుంటోన్న వారికి రక్షణ కల్పించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌లో ఓ పిటిషన్‌ దాఖలు చేశాయి.
valentine day
Hyderabad

More Telugu News