Rammohan Raog: తమిళనాడులో తెలుగు వారి కోసం రాజకీయపార్టీ పెడతా: మాజీ సీఎస్ రామ్మోహన్ రావు

Tamilnadu Ex cs Ram mohanrao says I will establish a political party for Telugu people
  • ఆరు నెలల పాటు తమిళనాడు వ్యాప్తంగా  పర్యటిస్తా
  • ఇక్కడి తెలుగు సంఘాలను ఏకం చేస్తా
  • రజనీ, కమల్ లు ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారు
తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు వారి కోసం రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఆరు నెలల పాటు తమిళనాడు వ్యాప్తంగా పర్యటిస్తానని, ఇక్కడి తెలుగు సంఘాలను ఏకం చేస్తానని అన్నారు. రజనీకాంత్, కమల హాసన్ లు ప్రజలను అయోమయంలోకి నెడుతున్నారని, హీరో విజయ్ కూడా రాజకీయరంగ ప్రవేశం చేసే ఆలోచనలో ఉన్నాడంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 ఎన్నికల్లో తెలుగు వారు రాజకీయ శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
Rammohan Raog
Tamilnadu Ex-cs
New political party

More Telugu News