YS Vivekananda Reddy: వైఎస్ వివేకా హత్య కేసు సీబీఐకు అప్పగింతపై విచారణ ఈ నెల 20కి వాయిదా

  Ys Viveka murder case probe is adjourned to february 20th
  • ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ
  • తమ వాదనలు వినిపించిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు
  • అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున విచారణ వాయిదా
వైఎస్ వివేకా హత్య కేసు విచారణను సీబీఐకు అప్పగించాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కూతురు సునీత, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. ఈ పిటిషన్లపై ఈరోజు విచారణ జరిగింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తమ వాదనను న్యాయస్థానానికి వినిపించారు. అడ్వకేట్ జనరల్ అందుబాటులో లేనందున ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.
YS Vivekananda Reddy
Murder
case
CBI
Ap High court

More Telugu News