Varla Ramaiah: విజయసాయిరెడ్డి గారూ! మీరు, మీ నాయకుడు నిజాయతీ పరులు కాదు: వర్ల రామయ్య

Varla Ramaiah comments on Vijayasaireddy
  • మీరు నిజాయతీని నమ్ముకుంటే అంబాసిడర్ కార్లలో తిరిగేవారు
  • రెండు గదుల అద్దె ఇళ్ళల్లో నివసిస్తూ ఉండేవారు
  • మీ ప్రస్తుత నివాసశైలి నిజాయతీ పరులు కాదని చెబుతోంది
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై, ‘మీ నాయకుడు’ అంటూ పరోక్షంగా జగన్ ని ప్రస్తావిస్తూ టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శలు చేశారు. వాళ్లిద్దరూ నిజాయతీపరులు కాదని, వారికి విశ్వసనీయత లేదంటూ ఓ ట్వీట్ చేశారు.

‘అయ్యా! విజయసాయి రెడ్డి గారు! మీరు, మీ నాయకుడు విశ్వసనీయతను, నిజాయతీని నమ్ముకుంటే, అంబాసిడర్ కార్లలో తిరుగుతూ, రెండు గదుల అద్దె ఇళ్ళల్లో నివసిస్తూ ఉండేవారు. మీ ప్రస్తుత నివాసశైలి నిజాయతీపరులు కాదని, విశ్వసనీయత మీకు లేదని స్పష్టం చేస్తుంది’ అని విమర్శించారు. ఏ విధంగా ఆస్తులు సంపాదించారో చెప్పాలని అన్నారు.  
Varla Ramaiah
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP

More Telugu News