15 రోజుల పాటు ఫాస్టాగ్ ఫ్రీ.. మరో 527 హైవేలపై ఫాస్టాగ్ విధానం అమలుకు కేంద్రం నిర్ణయం
- ఈ నెల 15 నుంచి 29 వరకు ఉచితం
- సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం కట్టాల్సిందే
- మినిమం బ్యాలెన్స్ లోడ్ చేసుకోవాలి
దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ ట్యాక్సుల వసూలు కోసం తీసుకువచ్చిన ఫాస్టాగ్ ను 15 రోజుల పాటు ఉచితంగా అందజేయనున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మరో 527 హైవేలపై ఫాస్టాగ్ టోల్ వసూలు విధానాన్ని ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్ ట్రాన్స్ పోర్టు, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.