Jagan: నేడు భీమవరంలో పెళ్లికి హాజరు కానున్న ఏపీ సీఎం జగన్‌

CM jagan leaves for bhimavaram to attend wedding function
  • మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహం
  • 3.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్న జగన్
  • అధికారుల ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ రోజు సాయంత్రం పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి వెళ్లనున్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు మనవడి వివాహం భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌లో జరగనున్న నేపథ్యంలో కాసేపట్లో 3.40 గంటలకు తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి జగన్ బయలుదేరుతారు.

హెలికాప్టర్‌ ద్వారా 4.25 గంటలకు భీమవరంలోని వీఎస్‌ఎస్‌ గార్డెన్‌కు చేరుకుంటారు. తిరిగి 5.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి వస్తారు. భీమవరానికి జగన్ వస్తోన్న నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నతాధికారులు, వైసీపీ నాయకులు ఇందుకు తగ్గ ఏర్పాట్లను పూర్తి చేశారు.
Jagan
West Godavari District
YSRCP

More Telugu News