Vijay Sai Reddy: బీజేపీ పెద్దల కంట్లో పడకుండా చంద్రబాబు తప్పించుకుని తిరుగుతున్నాడు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy satires on chandrababu
  • పాత కేసులు గుర్తుకు వచ్చి తిరగతోడుతారని భయం
  • గతంలో ఏరికోరి ఇన్విటేషన్లు తెప్పించుకునేవాడు
  • ఇప్పుడు పిలిచినా వెళ్లే పరిస్థితిలో లేడని ఎద్దేవా
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బీజేపీ పెద్దల కంట్లో పడకుండా గడచిన ఎనిమిది నెలల నుంచి తప్పించుకుని తిరుగుతున్నాడని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్‌లో ఈ మేరకు ఓ వ్యంగ్యోక్తిని పోస్టుచేశారు. ఢిల్లీలో బాబు కనిపిస్తే బీజేపీ పెద్దలకు ఎక్కడ తన పాతకేసులు గుర్తుకు వచ్చి తిరగతోడతారేమోనని చంద్రబాబు అటువైపు చూడడానికి కూడా భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఒకప్పుడు దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉన్నా తన నమ్మకస్తులను పంపించి కోరి ఇన్విటేషన్‌ సంపాదించుకునేవాడని, ఇప్పుడు పిలిచినా వెళ్లే పరిస్థితి లేదని అన్నారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో హాట్రిక్‌ సాధించిన అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా విజయసాయి ఈ సెటైర్‌ వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కేజ్రీవాల్‌ టీడీపీ తరపున ఒకటి రెండు సభల్లో పాల్గొని ప్రచారం కూడా చేశారు.
Vijay Sai Reddy
Chandrababu
Twitter
BJP

More Telugu News