Hyderabad: హైదరాబాద్‌లో కొల్లగొట్టిన వజ్రాలు.. బీహార్‌లోని పశువుల పాకలో లభ్యం!

Police recovered diamond jewellers from Bihar Gang
  • బంజారాహిల్స్‌లోని వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన సొత్తు చోరీ
  • కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు
  • మధుబనిలోని పశువుల పాకలో నగలను పాతిపెట్టిన ముఠా
గతేడాది డిసెంబరు 8న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన చోరీ సంచలనం రేపింది. ఓ వ్యాపారి ఇంట్లో కోట్ల రూపాయల విలువైన వజ్రాభరణాలను దోచేసిన బీహార్‌ ముఠా పరారైంది. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం రంగంలోకి దిగారు.

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఎట్టకేలకు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రికవరీ చేశారు. చోరీ చేసిన వజ్రాభరణాలతో బీహార్‌లోని మధుబనికి పారిపోయిన నిందితులు చాలా నగలను అమ్మేశారని, వజ్రాలను మాత్రం ఓ ఇంట్లోని పశువుల కొట్టంలో పాతిపెట్టారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. మరికొంత సొత్తును గోడలో దాచిపెట్టారని వివరించారు.
Hyderabad
Bihar Gang
Crime News
Madhubani

More Telugu News