Jagan: జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ కౌంటర్ దాఖలు.. విచారణ ఏప్రిల్ 9కి వాయిదా

CM Jagan case adjourned to April 9th
  • తెలంగాణ హైకోర్టులో ఈరోజు జరిగిన విచారణ  
  • జగన్ కు మినహాయింపు ఇవ్వకుండా ఆదేశాలివ్వాలని కోరిన సీబీఐ
  • ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వద్దన్న సీబీఐ  
సీబీఐ కేసుల్లో ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఈ కేసు విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. జగన్ కు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.

ఆర్థికపరమైన కేసుల్లో ఉన్న నిందితులకు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోరింది. జగన్ కు మినహాయింపు ఇస్తే సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉందని, మినహాయింపు ఇవ్వకుండా విచారణకు హాజరయ్యేలా ఆదేశాలివ్వాలని సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పై ఏప్రిల్ 9న వాదనలు వింటామని హైకోర్టు పేర్కొంది.
Jagan
YSRCP
Petetion
High Court
Telangana

More Telugu News