పెరిగిన వంటగ్యాస్ సిలిండర్ ధర
- ఆయా ప్రాంతాలను బట్టి రూ.149 వరకు పెంపు
- ఢిల్లీలో సిలిండర్ ధర రూ.858.50
- పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలు
ధర పెంపువల్ల వినియోగదారుడిపై అదనంగా ఏడు రూపాయాల భారం పడే అవకాశముంది. గత ఆగస్టు నుంచి సిలిండర్ ధరను కంపెనీలు ప్రతీ నెల పెంచుతున్నాయి. ఈ క్రమంలో తాజా పెంపు ఆరోది. చివరిసారిగా జనవరి 1న సిలిండర్ ధరను రూ.19 పెంచాయి. కాగా, పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నాయని కంపెనీలు తెలిపాయి. ఈ పెంపు సామాన్యుడి బడ్జెట్ కు ప్రతిబంధకంగా మారాయి.