Narendra Modi: ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారత్‌ స్వాగతం పలుకుతుంది: ట్రంప్ పర్యటనపై మోదీ ట్వీట్లు

Extremely delighted says PM Modi
  • ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో ట్రంప్ పర్యటన
  • వారి రాక చాలా ప్రత్యేకమైంది
  • భారత్, అమెరికా స్నేహ బంధం ఇలాగే  సుస్థిరంగా నిలుస్తుంది
ఈ నెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త్‌లో పర్యటించనున్న విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్లు చేశారు. 'ఫిబ్రవరి 24, 25న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆ దేశ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ భారత్‌లో పర్యటిస్తుండడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా అతిథులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా భారత్‌ స్వాగతం పలుకుతుంది' అని తెలిపారు.

'వారి రాక చాలా ప్రత్యేకమైంది. భారత్, అమెరికా స్నేహ బంధం ఇలాగే చాలా కాలం పాటు సుస్థిరంగా నిలవడానికి ఈ పర్యటన దోహదపడుతుంది.  ప్ర‌జాస్వామ్యంతో పాటు బ‌హుళ‌త్వం అంశాలకు భారత్, అమెరికా ఇరు దేశాలూ నిబద్ధతతో ఒకే తీరుతో కట్టుబడి ఉన్నాయి. చాలా అంశాల్లో ఇరు దేశాలు విస్తృత స్థాయిలో స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహ‌ బంధం వ‌ల్ల భారత్‌, అమెరికా పౌరులకే కాకుండా ప్ర‌పంచ దేశాల‌కు కూడా మంచి జ‌రుగుతుంది' అని చెప్పారు.  
Narendra Modi
India
Donald Trump

More Telugu News