Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. కీలక అంశాలపై చర్చ

ap cabinet meets in amaravati
  • జగన్‌ నేతృత్వంలో భేటీ
  • అమరావతిలో కొనసాగుతోన్న సమావేశం
  • రాజధానిపై చర్చ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలో అమరావతిలోని సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశమైంది. వివిధ ప్రతిపాదనలపై మంత్రులతో జగన్ చర్చిస్తున్నారు. ప్రధానంగా జగనన్న విద్యాకానుక పథకం, రాష్ట్ర వ్యవసాయ మండలి ఏర్పాటు, సీపీఎస్ ర్యాలీలపై నమోదైన కేసుల రద్దు, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల విచారణకు తిరుపతిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు, సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రతిపాదనలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు.

మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను 20 రోజులకు కుదించే ప్రతిపాదనపై కూడా చర్చిస్తున్నారు. రాజధాని అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు పలు కీలక విషయాలపై మంత్రులతో జగన్ మాట్లాడుతున్నారు. ఈ సమావేశం అనంతరం తాము తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించనున్నారు.
Andhra Pradesh
AP Cabinet
Amaravati
YSRCP

More Telugu News