IYR Krishna Rao: అమరావతి ఉద్యమానికి జాకీలు పెట్టి లేపినా ప్రజల నుంచి స్పందన కరవైంది: ఐవైఆర్

IYR Krishna Rao response on Amaravati protests
  • ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వారంలోనే దావానలంలా వ్యాపించింది
  • అమరావతి ఉద్యమం విఫలమైంది
  • బీజేపీ, జనసేనలు ఈ విషయాన్ని గ్రహించాలి
తెలుగుదేశం పార్టీపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. అమరావతి పేరుతో టీడీపీ ప్రారంభించిన ఉద్యమం విఫలమైందని ఆయన అన్నారు. అప్పట్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైన వారంలోగానే దావానలంలా రాష్ట్రమంతా వ్యాపించిందని చెప్పారు. కానీ, అమరావతి ఉద్యమాన్ని టీడీపీ, మీడియాలోని ఒక వర్గం జాకీలు పెట్టి లేపినా ప్రజల నుంచి స్పందన కరవైందని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని బీజేపీ, జనసేన పార్టీలు గ్రహించాలని... రాష్ట్రంలో ఎదుగుదలకు ఇంకేదైనా అజెండాను ఎంచుకుని, ముందుకు సాగాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు.
IYR Krishna Rao
Telugudesam
Janasena
BJP
Amaravati

More Telugu News