Rajinikanth: ‘దర్బార్’ డైలాగ్‌కు.. రజనీకాంత్ పోటీకి లింకు.. తమిళనాడులో జోరుగా ప్రచారం

Super Star Rajinikanth to contest from Veppanahalli
  • వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో వేప్పనహళ్లి నుంచి పోటీకి రజనీ?
  • దర్బార్ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్‌ను ఉటంకిస్తున్న మద్దతుదారులు
  • వేప్పనహళ్లిలో రజనీ మక్కల్ మండ్రం సేవా కార్యక్రమాలు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. కృష్ణగిరి జిల్లా వేప్పనహళ్లి నుంచి ఆయన బరిలోకి దిగుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి రెండేళ్లైనా పార్టీ ఊసెత్తని రజనీకాంత్ ఈ ఏడాది తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇటీవల విడుదలైన ‘దర్బార్’ సినిమాలో రజనీకాంత్ ఓ సందర్భంలో తన సొంతూరు కృష్ణగిరి జిల్లాలోని నాచ్చికుప్పమని చెబుతాడు. ఇది వేప్పనహళ్లి నియోజకవర్గం పరిధిలోనే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన ఆ నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులు ఈ నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. దీనికి రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావు కూడా హాజరయ్యారు. దీంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్టు అయింది.
Rajinikanth
politics
Tamil Nadu
Dabar

More Telugu News