Kalyan: హీరోగా స్టార్ ప్రొడ్యూసర్ తనయుడి ఎంట్రీ

DVV Danayyas son Kalyan to be introduced as hero
  • హీరోగా దానయ్య తనయుడు కల్యాణ్ 
  • నిర్మాతగా భరత్ చౌదరి 
  • దర్శకుడిగా శ్రీవాస్
నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించిన ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలతో పాటు, మాస్ ఆడియన్స్ కి నచ్చే సినిమాలను కూడా ఆయన నిర్మించాడు. అలాంటి దానయ్య తన తనయుడు కల్యాణ్ ను హీరోగా పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాడు.

కల్యాణ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను ఆయన మరో నిర్మాత అయిన భరత్ చౌదరికి అప్పగించడం విశేషం. ఈ సినిమాకి శ్రీవాస్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. 'సాక్ష్యం' పరాజయం తరువాత ఆయన రూపొందిస్తున్న సినిమా ఇదే. ఈ సినిమాకి ఆయనే కథ - మాటలు అందిస్తున్నాడు. ప్రస్తుతం కథానాయికతో పాటు ఇతర నటీనటులను .. సాంకేతిక నిపుణులను ఎంపిక చేసే ప్రక్రియ జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Kalyan
DVV Danayya
Bharath Chaudary
Sri Vas

More Telugu News