Delhi Election Results: మిస్స్ డ్ కాల్ ఇవ్వండి, పార్టీలో చేరి కేజ్రీవాల్ వెంట నిలవాలంటూ ఆప్ ట్వీట్

Buoyed By Delhi Results AAPs Missed Call Request to join party
  • కేజ్రీవాల్ ఫొటోతో ‘జాయిన్ ద రివల్యూషన్, జాయిన్ ఆప్’ పోస్టర్
  • 9871010101  నంబర్ ఇచ్చిన ఆప్
  • నెటిజన్ల నుంచి ఫుల్లుగా రెస్పాన్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం దిశగా సాగుతూ మంచి జోష్ మీద ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. మిస్స్ డ్ కాల్ ఉద్యమం మొదలుపెట్టింది. 9871010101  నంబర్ కు మిస్స్ డ్ కాల్ ఇచ్చి, పార్టీలో చేరాలంటూ నేటి మధ్యాహ్నం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ‘జాయిన్ ద రివల్యూషన్.. జాయిన్ ఆప్’ అంటూ కేజ్రీవాల్ పోస్టర్ ను ట్విట్టర్ లో పెట్టింది. దేశం నిర్మాణం కోసం ఆప్ లో చేరండి అంటూ పిలుపు ఇచ్చింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో ఆప్ గెలుపు ఖాయమైన కొంత సేపటికే ఇలా ట్వీట్  చేయడంపై అందరిలో ఆసక్తి కలిగింది. ఆప్ ట్వీట్ చేసిన గంటన్నరలోనే 8 వందల మందికిపైగా రీట్వీట్ చేశారు. నాలుగు వేల మందికిపైగా లైక్ చేశారు.
Delhi Election Results
Delhi 2020
AAP
Missed Call Request
Join AAP
Arvind Kejriwal

More Telugu News