Raviteja: ఈ రేంజ్ లో 'క్రాక్' ఉన్నవాడే కరెక్ట్ అనుకుంటారట

Raviteja plays police officer in Krack Movie
  • పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ 
  •  కీలకమైన పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ 
  •  మే 8వ తేదీన భారీస్థాయి విడుదల  
రవితేజ తాజా చిత్రంగా 'క్రాక్' సినిమా రూపొందుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా 'క్రాక్' గా ప్రవర్తిస్తుందట. అయితే విలన్ ఆటకట్టించడానికి ఆ రేంజ్ లో క్రాక్ ఉన్నవాడే కరెక్ట్ అనిపించేలా ఆయన పాత్రను డిజైన్ చేసినట్టుగా చెబుతున్నారు.

'కిక్' టైటిల్ రవితేజ పాత్రకి ఎంత కరెక్ట్ గా అనిపించిందో, 'క్రాక్' టైటిల్ కూడా అలాగే అనిపిస్తుందని అంటున్నారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రవితేజ ఫుల్ ఎనర్జీతో చేసే ఎపిసోడ్స్ చూసి తీరవలసిందేనని చెబుతున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న  ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుంది. మే 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
Raviteja
Sruthi Hassan
Krack Movie

More Telugu News