Chinmayi: కార్తీక్, మనో మంచి గాయకులే కానీ మంచి మగాళ్లు కాదు: చిన్మయి ఆరోపణలు

  • గతలో వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసిన చిన్మయి
  • కొంతకాలం కిందట కార్తీక్ పైనా ఆరోపణలు
  • ఈ విషయంలో మనో ఫోన్ చేశారన్న గాయని
  • రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారని వెల్లడి
గీత రచయిత వైరముత్తుపై 'మీటూ' ఆరోపణలతో సంచలనం సృష్టించిన యువ గాయని చిన్మయి మరోసారి స్పందించింది. ఈసారి సింగర్ కార్తీక్, సీనియర్ గాయకుడు మనోలను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. కార్తీక్, మనో మంచి గాయకులే కావొచ్చు కానీ, వాళ్లిద్దరూ మంచి మగాళ్లు మాత్రం కారని స్పష్టం చేసింది. కార్తీక్ తనను వేధిస్తున్నాడంటూ చిన్మయి కొన్నాళ్ల కిందట ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల నేపథ్యంలో మనో తనకు ఫోన్ చేశారని చిన్మయి తాజాగా వెల్లడించింది.

"కార్తీక్ పై ఆరోపణలతో సంబంధం ఉన్న వారందరినీ తీసుకుని మనో గారు తన ఇంటికి రమ్మన్నారు. ఈ వేధింపులకు సంబంధించిన ఆరోపణలతో కార్తీక్ భార్య ఎంతో వేదనకు గురవుతోంది. ఈ గొడవలతో కార్తీక్ కెరీర్ దెబ్బతింటోంది. నువ్వు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చావు, కార్తీక్ కూడా ఎంతో శ్రమించి ఈ స్థానానికి చేరుకున్నాడు" అంటూ తామిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు మనో ప్రయత్నించారని చిన్మయి వెల్లడించింది.

కార్తీక్ ఒకస్థాయికి చేరిన తర్వాత ఇతరులను ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించాడని ఆరోపించింది. కాగా, ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికల్లో చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురికాగా, కార్తీక్ కు యూనియన్ లో స్థానం లభించింది. ఇది కూడా చిన్మయిని మరింత బాధించింది.
Chinmayi
Karthik
Mano
Kollywood
Singer

More Telugu News