onion: దిగి వచ్చిన ఉల్లి ధరలు

  • కిలో రూ.30కి తగ్గిన ధరలు
  • హోల్ సేల్ మార్కెట్లో క్వింటాల్ రూ.2,500 లోపే..
  • ఉల్లి పంట దిగుబడులు మొదలవడమే కారణం
ఇటీవలి కాలంలో కోయకుండానే కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు బాగా దిగొచ్చాయి. కిలో రూ.200 దాకా వెళ్లిన రేట్లు ఇప్పుడు రూ. 30 దాకా దిగొచ్చాయి. మంచి క్వాలిటీ  ఉన్న ఉల్లిగడ్డలు కూడా కిలో రూ.35 నుంచి రూ.40 వరకు అందుబాటులోకి వచ్చాయి. మామూలు, కాస్త సైజు చిన్నగా ఉంటే రూ.20కి కూడా అమ్ముతున్నారు.

దిగుబడులు మొదలవడంతో..

సోమవారం హైదరాబాద్ లోని హోల్ సేల్ మార్కెట్లలో క్వింటాల్ ఉల్లి ధరలు క్వాలిటీని బట్టి రూ.2000 నుంచి రూ.3000 వరకు పలుకుతున్నాయి. దాంతో రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గాయి. దేశంలో ఉల్లి ఎక్కువగా పండించే మహారాష్ట్రతో పాటు తెలంగాణ, ఏపీల్లోనూ ఉల్లి పంట దిగుబడులు వస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా విదేశాల నుంచి ఉల్లి దిగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ధరలు నేలకు దిగి వచ్చాయి.

ఉత్తరాన ఇంకా దిగిరాని ధరలు

మరోవైపు ఉత్తర భారతదేశంలోని బిహార్, ఉత్తరప్రదేశ్  వంటి రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఉల్లి ధరలు మండుతూనే ఉన్నాయి. అక్కడ రిటైల్లో ఇప్పటికీ రూ.60, రూ.70 పైనే అమ్ముతున్నారు. వ్యాపారులంతా కుమ్మక్కై భారీగా స్టాక్ ను బ్లాక్ చేయడంతో ధరలు తగ్గడం లేదని అంటున్నారు.
onion
onion price down
price down

More Telugu News