ఆ దుస్తులు ధరిస్తున్నాం.. ఆర్థిక మాంద్యం ఎక్కడుంది: బీజేపీ ఎంపీ వీరేంద్ర సింగ్
- దేశ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది
- దేశంలో చాలామంది సూట్లు, ప్యాంట్లు ధరిస్తున్నారు
- పరిస్థితి బాగా లేకుంటే..ధోవతీలు, కుర్తాలు ధరించేవారు
దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని ఎలా చెప్పగలరు? అంటూ ప్రశ్నిస్తూ, దేశంలో చాలామంది జాకెట్, సూట్లు ధరిస్తున్నారన్నారు. వాటితో పోలిస్తే తక్కువ ధరకు లభించే సంప్రదాయ ధోవతీలు, కుర్తాలు ఎందుకు ధరించడంలేదో చెప్పాలన్నారు. ఈ పరిస్థితి దేశ ఆర్థిక పరిస్థితి బాగా ఉందనడానికి చిహ్నమని తాను పక్కగా చెబుతున్నానన్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మంచి సూట్లు, ప్యాంట్లు, పైజామాలు ధరించేవారం కాదని ఎంపీ చెప్పారు.