Anasuya: అనసూయ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం: ఏసీపీ

  • అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారంటూ అనసూయ ఫైర్
  • 'మసాలా' అనే ఖాతా నుంచి పోస్టు పెట్టారన్న ఏసీపీ
  • పలువురు హీరోయిన్లపై కూడా ఇలాంటి పోస్టులే పెట్టారని వెల్లడి
తన ఫొటో మార్ఫింగ్ చేయడమే కాకుండా, తన భర్తపై ట్విట్టర్ లో అసభ్యకర పోస్టు పెట్టారంటూ ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుండడం తెలిసిందే. దీనిపై అనసూయ సైబర్ క్రైమ్ విభాగాన్ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఏసీపీ స్పందించారు.

ఆ అభ్యంతరకర పోస్టు మసాలా అనే ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చినట్టు గుర్తించామని, అనసూయ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ వెల్లడించారు. 'మసాలా' అనే అకౌంట్ నుంచి పలువురు హీరోయిన్లు, ప్రముఖ యాంకర్లపై కూడా ఇలాంటి పోస్టులు చేశారని వివరించారు.
Anasuya
Morphing
Police
CyberCrime

More Telugu News