ICC: బంగ్లాదేశ్ క్రికెటర్ల దురుసుతనంపై స్పందించిన ప్రియమ్ గార్గ్!

  • ఆటలో గెలుపు, ఓటమి సహజం
  • బంగ్లా ఆటగాళ్లు అతి చేయకుండా ఉండాల్సిందన్న ప్రియమ్
  • ఫుటేజ్ ను పరిశీలిస్తున్న ఐసీసీ
నిన్న అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ ఆటగాళ్ల ప్రవర్తన సర్వత్రా విమర్శలను కొని తీసుకుని రాగా, భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ స్పందించాడు. తమ జట్టు ఓటమిని స్వీకరించిందని, గేమ్ లో ఓడిపోవడం, గెలవడం చాలా సహజమని అభిప్రాయపడ్డాడు. అయితే, గెలుపు అనంతరం బంగ్లా ఆటగాళ్లు అతి చేయకుండా ఉండాల్సిందని చెప్పాడు.

కాగా, జరిగిన ఘటనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లా యువ జట్టుపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై చర్చించే ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
ICC
Bangladesh
India
U-19
Priyam Garg
Cricket

More Telugu News