Vijay Sai Reddy: బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు.. శిక్ష తప్పదు: విజయసాయిరెడ్డి

  • ఏబీ వెంకటేశ్వరరావుపై తీవ్ర విమర్శలు
  • యూనిఫాం లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త 
  • అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు
  • ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చాడు 
ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతల నుంచి వస్తోన్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.  

'ఏబీ వెంకటేశ్వరరావు యూనిఫాం లోపల పచ్చచొక్కా తొడుక్కున్న టీడీపీ కార్యకర్త. బాబు, లోకేశ్ తర్వాత ప్రభుత్వంలో ఐదేళ్లూ ఈయనే చక్రం తిప్పారు. అక్రమ పద్ధతిలో ఆస్తులు పోగేసుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీసుకే కళంకం తెచ్చిన ఇలాంటి వారు ఆలస్యంగానైనా శిక్ష అనుభవించక తప్పదు' అని అన్నారు.

కాగా, అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు వైసీపీని బలహీనపరిచేందుకే నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారని,  ఫోన్ ట్యాపింగ్ మాఫియాను నడిపారని వైసీపీ నేతలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News