KCR: సీఎం కేసీఆర్ జన్మదినం నాడు ప్రతి ఒక్కరూ ఓ మొక్క నాటండి: కేటీఆర్

  • 17న కేసీఆర్ పుట్టిన రోజు
  • ఆ రోజు కనీసం ఒక్క మొక్కయినా నాటాలి 
  • ట్విట్టర్ లో కేటీఆర్
ఈ నెల 17న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు 66వ ఏట అడుగు పెట్టనుండగా, ఆయన తనయుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్, తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ ట్వీట్ వైరల్ అయింది. "2020, ఫిబ్రవరి 17న గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 66 ఏళ్లు రాబోతున్నాయి. హరిత హారం అంటే ఆయనకు ఎంత ఇష్టమో మీ అందరికీ తెలుసు. కాబట్టి అందరు టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి మన నేత జన్మదిన వేడుకలను జరుపుకోవాలని కోరుతున్నా. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటండి" అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
KCR
KTR
Birthday
Plant Slapping
Twitter

More Telugu News