Mahesh Babu: నమ్రతతో మహేశ్ బాబు లవ్లీ ఫొటో... వైరల్!

  • మహేశ్ వివాహం జరిగి 15 ఏళ్లు
  • స్పెషల్ పిక్ ను పోస్ట్ చేసిన ప్రిన్స్ 
  • క్షణాల్లో వేలకొద్దీ లైక్స్
తన భార్య నమ్రతతో కలిసున్న ఓ చిత్రాన్ని టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు పోస్ట్ చేయగా, అదిప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో మహేశ్, ఈ చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నాడు. క్షణాల్లోనే దీనికి వేలకొద్దీ లైక్స్, వందల కొద్దీ షేర్స్ వచ్చాయి. తమ వివాహం జరిగి 15 సంవత్సరాలు అయిన విషయాన్ని మహేశ్, తన పోస్ట్ లో ప్రస్తావించాడు. రోజురోజుకూ నీపై ప్రేమ పెరిగిపోతూనే ఉందని కామెంట్ కూడా చేశాడు. ఇక ఈ పిక్ ను చూసిన ఫ్యాన్స్ తమదైన కామెంట్లతో జంటను అభినందనలతో ముంచెత్తుతున్నారు.


Mahesh Babu
Namrata
Marriage Day
Viral
Facebook

More Telugu News