Khammam District: అర్ధరాత్రి కలకలం రేపిన ఉపాధ్యాయుడి దారుణహత్య

  • ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఘటన
  • ఇంట్లో నిద్రిస్తున్న ఉపాధ్యాయుడి గొంతు కోసిన నిందితులు
  • అడ్డుకున్న భార్యపైనా దాడి
ఖమ్మం జిల్లాలో గత అర్ధరాత్రి జరిగిన ఉపాధ్యాయుడి దారుణ హత్య కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం లచ్చిగూడెంలోని నాగన్నగుంపునకు చెందిన కారం చిన్న రామకృష్ణ (35) స్థానిక ఎంఈవో కార్యాలయంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్సీ)గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి భార్య, పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. నిద్రిస్తున్న రామకృష్ణను గొంతుకోసి హత్య చేశారు. అడ్డుకునేందుకు యత్నించిన అతడి భార్యపైనా వారు దాడిచేశారు. అనంతరం పరారయ్యారు. భూ వివాదాలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Khammam District
teacher
Murder
Telangana

More Telugu News