Rashi khanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • షూటింగులో ఏడ్చేసిన రాశిఖన్నా!
  • రికార్డు స్థాయిలో 'ఆర్ఆర్ఆర్' బిజినెస్ 
  • ఒకే చిత్రంలో నయనతార, సమంత  
 *  'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో నటిస్తున్నప్పుడు కొన్ని సన్నివేశాల్లో ఏడ్చేసేదాన్ని అంటోంది కథానాయిక రాశిఖన్నా. "ఇందులో యామిని అనే పాత్ర చేశాను. ఆ పాత్ర నాకు బాగా కనెక్ట్ అయింది. ఎంతెలా అంటే, కొన్ని సినిమాల్లో చేస్తున్నప్పుడు నిజంగానే ఏడ్చేసేదాన్ని. నా ఇన్వాల్వ్ మెంట్ చూసి, దర్శకుడు క్రాంతిమాధవ్, హీరో విజయ్ భయపడేవారు" అని చెప్పింది రాశి.
*  ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది. ఇప్పటికే నిజాం ప్రాంతపు హక్కులు 75 కోట్లకు, నెల్లూరు 10 కోట్లకు, కర్ణాటక 50 కోట్లకు అమ్ముడు పోగా, తాజాగా కృష్ణా జిల్లా హక్కులు 16 కోట్లకు, పశ్చిమ గోదావరి జిల్లా హక్కులు 14 కోట్లకు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.
*  నయనతార, సమంత కలసి ఓ తమిళ చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ రూపొందించే తాజా చిత్రంలో వీరిద్దరూ హీరోయిన్లుగా నటిస్తారని తెలుస్తోంది.  
Rashi khanna
Vijay Devarakonda
Rajamouli
Nayanatara
Samantha

More Telugu News