Andhra Pradesh: వెలగపూడిలో 151 గంటల నిరాహార దీక్షను అర్ధరాత్రి భగ్నం చేసిన పోలీసులు

  • 151 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకోవాలంటూ ఇద్దరు యువకుల దీక్ష
  • పరిస్థితి క్షీణించడంతో రంగంలోకి పోలీసులు
  • మహిళలు అడ్డుకున్నా బలవంతంగా ఆసుపత్రికి తరలింపు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ వెలగపూడిలో చేపట్టిన 151 గంటల నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. గత రాత్రి దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న పోలీసులు దీక్ష చేస్తున్న బొర్రా రవి, తాడికొండ శ్రీకర్‌లను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

రాజధాని విషయంలో వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు మనసు మార్చుకోవాలంటూ వీరిద్దరూ 151 గంటల దీక్షకు దిగారు. అయితే, వీరిలో బీపీ, చక్కెర స్థాయులు పడిపోయినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో స్పందించిన పోలీసులు అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో శిబిరం వద్దకు చేరుకుని దీక్షను భగ్నం చేసి వారిని బలవంతంగా అంబులెన్సులోకి ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు పోలీసులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Andhra Pradesh
Amaravati
velgapudi
YSRCP

More Telugu News