Nara Lokesh: దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడం లేదు: ఏపీ సర్కార్ పై నారా లోకేశ్ ఫైర్

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేసిన రైతులు, వారితో పాటు పెద్ద ఎత్తున మహిళలు, యువత 54 రోజులుగా ఆందోళనలు చేస్తున్నా దున్నపోతు ప్రభుత్వంలో చలనం రావడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిని తరలించవద్దంటూ వెలగపూడిలో ఇద్దరు యువకులు రవి, శ్రీకర్ ల నిరాహారదీక్ష ఐదో రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడంపైనా లోకేశ్ మండిపడ్డారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ యువత 151 గంటల నిరాహారదీక్ష చేస్తున్నారని అన్నారు. ఆ యువకుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP
Amaravati

More Telugu News