Baireddy: వైసీపీ తీరు చూస్తే నియోజకవర్గానికి ఒక రాజధాని ఏర్పాటు చేస్తారేమో!: బైరెడ్డి సెటైర్
- గ్రామాల్లో వైసీపీ ముఠాలను చూసి ప్రజలు భయపడుతున్నారన్న బైరెడ్డి
- నీటి సమస్యపై 12న కర్నూలులో నిరసన తెలుపుతానని వెల్లడి
- తెలంగాణ జలచౌర్యంపై జగన్ నిలదీయడంలేదని వ్యాఖ్యలు
రాష్ట్రంలో పరిణామాలపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందించారు. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రశ్నించిన ఆయన, వైసీపీ తీరు చూస్తుంటే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో రాజధాని ఏర్పాటు చేస్తారనిపిస్తోందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో వైసీపీ ముఠాలను చూసి ప్రజలు హడలిపోతున్నారని వ్యాఖ్యానించారు. నీటి సమస్యపై ఈ నెల 12న కర్నూలులో నిరసన తెలుపుతామని బైరెడ్డి వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ పై విమర్శలు చేస్తూ, పోలవరం నుంచి బనకచర్లకు నీటిని తెస్తానంటూ సీఎం కట్టుకథలు చెబుతున్నాడని మండిపడ్డారు. ఓవైపు హంద్రీనావా ప్రవహిస్తున్నా, పక్కనే ఉన్న కేసీ కెనాల్ కు నీరు లేని పరిస్థితి నెలకొందని, ఆర్డీఎస్ వద్ద తెలంగాణ నీటిచౌర్యంపై జగన్ ఎందుకు మాట్లాడడంలేదని బైరెడ్డి ప్రశ్నించారు.