Nimmala kistappa: ఎంపీ గోరంట్ల మాధవ్ పై టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప ఫైర్

  • పార్లమెంట్ చరిత్రలో మాధవ్ లా ఎవరూ ప్రవర్తించలేదు! 
  • గోరంట్ల ‘వరెస్ట్ ఎంపీ’
  • మాధవ్ తన మాట తీరు మార్చుకోవాలి
వైసీపీ ఎంపీ గోరంట్ల  మాధవ్ పై టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప మండిపడ్డారు. లోక్ సభలో టీడీపీ సభ్యులు ఇటీవల ప్రసంగిస్తున్న సమయంలో మాధవ్ ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ చరిత్రలో గోరంట్ల మాధవ్ లా ఇంత వరకూ ఎవరూ ప్రవర్తించలేదని, ‘వరెస్ట్ ఎంపీ’ అంటూ నిప్పులు చెరిగారు. గోరంట్ల మాట్లాడుతున్న తీరు సవ్యంగా లేదని విమర్శించారు. జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి వెంట వెళ్తున్న మాధవ్, చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. నాడు రాష్ట్రంలో ‘కియా’ ఏర్పాటుకు చంద్రబాబు ఎంతో కృషి చేశారని, ఈ పరిశ్రమను దక్కించుకోవాలని చాలా రాష్ట్రాలు పోటీపడ్డాయని గుర్తుచేశారు.
Nimmala kistappa
Telugudesam
YSRCP
Gorantla

More Telugu News