Ex.Inteligence chieat: ఈ సస్పెన్షన్‌తో నాకు పోయిందేమీ లేదు...ఆందోళన వద్దు : సీనియర్‌ ఐపీఎస్‌ వెంకటేశ్వరరావు

  • కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందవద్దని సూచన
  • అక్రమాలపై మీడియాలో వస్తున్న కథనాలన్నీ అవాస్తవం
  • ఈ వ్యవహారంలో చట్టపరంగా ముందుకు వెళ్తాను
భద్రతా పరికరాల కొనుగోలులో ఉద్దేశపూర్వకంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వ్యవహరించారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం తనపై వేసి సస్పెన్షన్‌ వేటుపై మాజీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు స్పందించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్రమాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ఈ చర్యతో మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదన్నారు. అందువల్ల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటన్నది త్వరలో తెలుస్తుందని, ఈ వ్యవహారంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.
Ex.Inteligence chieat
AB venkateswararao

More Telugu News