Rain: తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన కారుమబ్బులు... పలు చోట్ల భారీ వర్షాలకు అవకాశం!

  • ఉపరితల ఆవర్తనానికి తోడు అల్పపీడనం
  • శనివారం నాడు పలు ప్రాంతాల్లో వర్షం
  • వచ్చే 24 గంటల్లో భారీ వర్షానికి చాన్స్
ఉపరితల ఆవర్తనంతో పాటు, బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడటంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో కారు మబ్బులు కమ్మాయి. నిన్నటి నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే 24 గంటల్లో సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. నిన్న వరంగల్, భూపాలపల్లి, నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో వర్షం కురిసింది. భూమి ఉపరితలానికి ఒకటిన్నర కిలోమీటరు పైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అధికారులు తెలియజేశారు. 
Rain
Telangana
Andhra Pradesh
Low Preasure

More Telugu News