అదనపు డీజీపీలుగా ప్రమోషన్ పొందిన.. ఏపీ ఐపీఎస్ లు అతుల్ సింగ్, ఆర్కే మీనా
- ఏపీలో ఐపీఎస్ అధికారులకు పదోన్నతుల ప్రకటన
- శ్రీకాంత్, ఖాన్, ప్రభాకర్ రావు, నాగేంద్రకుమార్ కు ఐజీ ర్యాంకింగ్
- రఘురామ్, రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, జయలక్ష్మి...లకు డిఐజీ హోదా
2002 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు సీహెచ్.శ్రీకాంత్, ఏఎస్. ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాంగేంద్రకుమార్ ఐజీ ర్యాంకు హోదా పొందారు. కాగా, 2006 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు కె.రఘురామ్, కె.రవికృష్ణ, సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఆర్ జయలక్ష్మి, జీవీజీ అశోక్ కుమార్, జి.విజయ్ కుమార్, ఎస్. హరికృష్ణ, ఎం.రవిప్రకాశ్, ఎస్వీ రాజశేఖర బాబు, కేవీ మోహనరావు, పీహెచ్ డీ రామకృష్ణ డీఐజీలుగా పదోన్నతి పొందారు.