Delhi: ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ విఫలమవుతాయంటున్న బీజేపీ

  • ఢిల్లీలో ముగిసిన పోలింగ్
  • ఎగ్జిట్ పోల్స్ ఆప్ వైపే మొగ్గు
  • 48 స్థానాల్లో తామే గెలుస్తామన్న ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ
ఢిల్లీలో పోలింగ్ ఘట్టం ముగిసిన తర్వాత విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకే మొగ్గుచూపుతున్నాయి. అయితే ఢిల్లీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేస్తోంది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ దీనిపై ట్విట్టర్ లో స్పందించారు. ఫలితాల రోజున ఎగ్జిట్ పోల్స్ అన్నీ విఫలమవుతాయని తెలిపారు. 48 స్థానాల్లో విజయం సాధించబోతున్నామని, కావాలంటే తన ట్వీట్ ను సేవ్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది బీజేపీనే అని తివారీ ఉద్ఘాటించారు. తమ విజయం ఖాయమని పేర్కొన్న ఆయన, ఎవరూ ఈవీఎంలను నిందించవద్దని పేర్కొన్నారు.
Delhi
Elections
Polling
BJP
Manoj Tiwary
Exit Polls

More Telugu News