Sivaji: నేను మద్దతు ఇచ్చింది టీడీపీకి కాదు: శివాజీ

  • చంద్రబాబు విజన్ కి సపోర్ట్ చేశానని వెల్లడి
  • చంద్రబాబును ఎప్పుడూ సాయం కోరలేదని స్పష్టీకరణ
  • ప్రత్యేక హోదా అంశంలో మోదీపై పోరాడితే జగన్ కూ మద్దతిస్తానన్న శివాజీ
సీఎం జగన్ ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో మోదీపై పోరాడితే తాను తప్పకుండా సపోర్ట్ చేస్తానని సినీ నటుడు శివాజీ స్పష్టం చేశారు. గతంలోనూ చంద్రబాబుకు మద్దతుగా నిలిచానని వెల్లడించారు. అయితే తాను సపోర్ట్ చేసింది టీడీపీకి కాదని, చంద్రబాబు విజన్ కి మద్దతు పలికానని వివరించారు. చంద్రబాబుకు సపోర్ట్ చేసినా ఎప్పుడూ ఆయన నుంచి చిన్న సహాయం కూడా కోరలేదని తెలిపారు. ఏపీలో మరో నాలుగేళ్ల వరకు జగన్ అధికారంలో ఉంటాడు కాబట్టి తనలాంటివాళ్లకు పెద్దగా పని ఉండదని శివాజీ అభిప్రాయపడ్డారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Sivaji
Actor
Tollywood
Telugudesam
Chandrababu
Andhra Pradesh

More Telugu News