Kannababu: రాజధాని కోసం జోలెపట్టిన చంద్రబాబు ఎంత మొత్తం వచ్చిందో చెప్పాలి: కన్నబాబు

  • చంద్రబాబు అబద్ధాల వైరస్ ప్
  • రాజధానికోసం కృత్రిమ ఉద్యం సృష్టించారు
  •  అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తాం
జగన్ సర్కారును కరోనా వైరస్ కన్నా ప్రమాదకర వైరస్ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ మాధ్యమంగా విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఏపీ మంత్రి కన్నబాబు ప్రతి విమర్శలు చేశారు. చంద్రబాబు అబద్ధాల వైరస్ అని అన్నారు. ఈ అబద్ధాల వైరస్ వల్ల ప్రజలు అయోమయానికి గురవుతున్నారని ఆరోపించారు. రాజధానికోసం కృత్రిమ ఉద్యమం సృష్టించారన్నారు.

అమరావతి రాజధానికోసం జోలె పట్టిన చంద్రబాబు.. నగదు, బంగారం, వెండి ఎంత వచ్చిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పారిశ్రామిక సంస్థలు తరలి పోవడంలేదని చెప్పారు. కియా సంస్థ అనంతపురం నుంచి ఎక్కడికీ వెళ్లడం లేదన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్, రేషన్ కార్డు ఉంటుందని చెప్పారు. విద్యుత్ బిల్లుల విషయంలో  ఆరు నెలలు సగటును పరిగణనలోకి తీసుకుంటామన్నారు.
Kannababu
Minister
Andhra Pradesh

More Telugu News