Mohan Babu: మోహన్ బాబు కొత్త లుక్ చూశారా..?

  • రఫ్ లుక్ తో అదరగొడుతున్న మోహన్ బాబు
  • సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్న లేటెస్ట్ ఫొటో
  • చిరంజీవి సినిమా కోసమేనంటూ ప్రచారం
సోషల్ మీడియాలో ఇప్పుడెక్కడ చూసినా ప్రముఖ నటుడు మోహన్ బాబు కొత్త గెటప్ కు సంబంధించిన ఫొటో సందడి చేస్తోంది. రఫ్ లుక్, మెడలో రుద్రాక్షలు, పులిగోరు పతకం... వెరసి మోహన్ బాబు ఏదో కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నారన్న దానికి ఈ ఫొటో బలం చేకూర్చేలా ఉంది.

టాలీవుడ్ వార్తల ప్రకారం... మోహన్ బాబు తాజా లుక్ మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం కోసమేనని టాక్ వినిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు దేవాదాయ ఉద్యోగిగా కనిపిస్తారట. ఇందులో మోహన్ బాబు ఓ సరైన పాత్ర పోషిస్తున్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి.
Mohan Babu
Photo
Chiranjeevi
Tollywood
Koratala Siva

More Telugu News