Forbes India 30: ఫోర్బ్స్ ఇండియా జాబితాలో నటి సాయి పల్లవి

  • ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో 27వ స్థానం
  • నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న నటి
  • సోషల్ మీడియాలో అభిమానుల అభినందనల వెల్లువ
అందాలతార సాయి పల్లవి తన అద్భుత నటన, నృత్యాలతో ప్రేక్షకులను కొల్లగొడుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు ఫోర్భ్స్ ఇండియా 30-అండర్-30 జాబితాలో చోటుచేసుకుంది. ముప్పై ఏళ్లలోపు వయసున్న వారు తమ తమ రంగాల్లో సాధించిన విజయాలకు గాను ఈ ఘనత దక్కుతుంది. మొత్తం ముప్పై మందికి ఈ జాబితాలో చోటును ఫోర్బ్స్ సంస్థ కల్పించింది.

కాగా, సాయి పల్లవికి తన అద్భుత నటనకు గాను ఈ గౌరవం దక్కింది. ఈ జాబితాలో ఆమెకు 27వ స్థానం దక్కింది. దీంతో అభిమానులు సామాజిక మాధ్యమాల్లో  సాయి పల్లవిని అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ.. నటనకు ప్రాధాన్యం ఇచ్చే పాత్రలను మాత్రమే ఎంచుకుని మరీ సినిమాలు చేస్తున్న ఈ తమిళ భామ తాజాగా తెలుగులో రానాతో కలిసి ‘విరాటపర్వం’, శేఖర్ కమ్ముల సారథ్యంలో రూపొందుతున్న ‘లవ్ స్టోరీ’ చిత్రంలో నటిస్తోంది.
Forbes India 30
Under 30 list
Actress Sai Pallavi
27th Rank
Tollywood
Kollywood

More Telugu News