'వరల్డ్ ఫేమస్ లవర్'ను ఆ సినిమాలతో పోల్చడం కరెక్ట్ కాదు: హీరోయిన్ రాశి ఖన్నా
- విజయ్ దేవరకొండ మంచి నటుడు
- ఆయానతో కలిసి నటించడం ఆనందంగా వుంది
- తన పాత్ర అందరికీ నచ్చుతుందన్న రాశి ఖన్నా
ఈ సందర్భంగా రాశి ఖన్నా మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను యామినీ పాత్రలో కనిపిస్తాను. నా వ్యక్తిత్వానికి దగ్గరగా వుండే పాత్ర కావడం వలన ఈజీగా చేయగలిగాను. అమ్మాయిలంతా నా పాత్రలో తమని చూసుకునేలా ఉంటుంది. ఈ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది.
ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ చూసినవాళ్లు, 'అర్జున్ రెడ్డి' .. 'డియర్ కామ్రేడ్' ఛాయలు కనిపించాయని అంటున్నారు. విషయం తెలుసుకోకుండా ఆ సినిమాలతో ఈ సినిమాను పోల్చడం కరెక్ట్ కాదు. 'వరల్డ్ ఫేమస్ లవర్' పూర్తిగా డిఫరెంట్ మూవీ. సినిమా చూసిన తరువాత ఆ విషయం మీకే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చింది.