Valentine's Day: ఈసారి ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేయం: వీహెచ్ పీ, భజరంగ్ దళ్

  • ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే
  • ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నామని చెప్పిన వీహెచ్ పీ, భజరంగ్ దళ్
  • పోస్టర్ విడుదల
  • పార్కులు, పబ్ లకు లేఖలు
ప్రేమికుల దినోత్సవం 'వాలెంటైన్స్ డే' రోజున లవర్స్ ఎవరైనా పబ్లిగ్గా కనిపిస్తే వారికి పెళ్లిళ్లు జరిపించే ఆనవాయితీకి సంఘ్ పరివార్ స్వస్తి పలకాలని నిర్ణయించింది. హైదరాబాదులో ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా వీహెచ్ పీ, భజరంగ్ దళ్ పోస్టర్ ను విడుదల చేశాయి. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తున్నామని, ఫిబ్రవరి 14న పార్కులు, పబ్ ల వద్ద అమరవీరుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి ప్రేమికులు కనిపిస్తే పెళ్లిళ్లు చేయబోమని, వారితో అమరవీరులకు నివాళులు అర్పించేలా చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే అన్ని పబ్ లకు, పార్కులకు లేఖలు పంపించామని తెలిపారు.
Valentine's Day
VHP
Bhajrang Dal
Hyderabad
Lovers

More Telugu News