Nara Lokesh: రివర్స్ టెండరింగ్ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారు: నారా లోకేశ్

  • పేదోడి కూడు లాగేసుకోవడానికి మనసు ఎలా ఒప్పింది?
  • మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా ఎత్తేయలేదన్నారు
  • ఇప్పుడు ‘రీ వెరిఫికేషన్’ పేరిట కొత్త డ్రామా ఎందుకు?
‘ఒక్క అవకాశం’ ఇచ్చి తనను గెలిపించాలని వైఎస్ జగన్ సీఎం కాకముందు ఎన్నికల ప్రచారంలో ప్రజలను కోరుకున్న విషయం తెలిసిందే. జగన్ కు ఆ ఒక్క అవకాశం లభించడం వల్లే ప్రజలకు ఎన్నో కష్టనష్టాలు, అనర్థాలు వచ్చాయని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారని, పేద ప్రజలపై జగన్ కు ఉన్న వ్యతిరేకతను పెంచుకుంటూ పోతున్నారని, ఏడు లక్షల పెన్షన్లు ఎత్తేశారని దుయ్యబడుతూ వరుస ట్వీట్లు చేశారు.  

మొన్నటి వరకూ ఒక్క పెన్షన్ కూడా తీసివేయలేదని బుకాయించిన వైసీపీ ప్రభుత్వం, ఇప్పుడు ‘రీ వెరిఫికేషన్’ పేరిట కొత్త డ్రామా ఎందుకు మొదలుపెట్టింది? 20 లక్షల రేషన్ కార్డులు ఎత్తేసి పేదవాడి నోటి దగ్గర కూడు లాగేసుకోవడానికి మనసెలా ఒప్పింది జగన్ గారు? అని లోకేశ్ ప్రశ్నించారు.

‘మీరు ఊరుకో రాజభవనంలో ఉండొచ్చు. పేద వాడు అద్దె ఇంట్లో ఉన్నా చెత్త రూల్స్ పెట్టి రేషన్ కార్డు తీసేస్తారా?’ అంటూ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద వాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకొని ఏం సాధిస్తారు? ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్న జగన్, ‘సంక్షేమ వ్యతిరేకి’గా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్ నిప్పులు చెరిగారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News