Arvind Kejriwal: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేజ్రీవాల్

  • సివిల్ లైన్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన కేజ్రీవాల్
  • కేజ్రీవాల్ కుటుంబసభ్యులు కూడా
  • తమ ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సివిల్ లైన్స్ పోలింగ్ కేంద్రంలో కేజ్రీవాల్ ఓటు వేశారు. ఆయనతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, కేంద్ర మంత్రులు జయశంకర్, హర్షవర్దన్, బీజేపీ ఎంపీలు పర్వేశ్ వర్మ, మీనాక్షి లేఖి, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా,మొత్తం 70 శాసనసభా స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ కొనసాగుతోంది.
Arvind Kejriwal
AAP
New Delhi
Assembly Elections

More Telugu News