Jammu And Kashmir: పుల్వామా తరహా దాడికి ఉగ్రవాదుల కుట్ర.. కేంద్రాన్ని అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్!

  • పుల్వామా దాడికి ఈ 14తో ఏడాది
  • బాలాకోట్‌లో 27 మంది ఉగ్రవాదులకు శిక్షణ
  • అప్రమత్తమైన కేంద్రం
పుల్వామాలోని సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరిగి ఈ నెల 14కు ఏడాది. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి దాడికి ఉగ్రవాదులు పథక రచన చేసినట్టు కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి సమాచారం అందింది. వెంటనే ఆ సమాచారాన్ని ప్రభుత్వంతో పంచుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు అప్రమత్తం చేశారు. బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరంలో శిక్షణ పొందిన 27 మంది పాక్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాదులు దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

తొలుత నియంత్రణ రేఖ వద్ద కాల్పులకు దిగాలని, దానిని భారత జవాన్లు తిప్పికొట్టే ప్రయత్నంలో ఉండగా ఉగ్రవాదులను భారత భూభాగంలోకి పంపేలా ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. బాలాకోట్‌లో ఉగ్రవాదులకు మసూద్ అజర్ కుమారుడు యూసుఫ్ అజర్ శిక్షణ ఇచ్చినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఇంటెలిజెన్స్ నివేదికతో కేంద్రం అప్రమత్తమైంది.
Jammu And Kashmir
pulwama attack
jaish e mohammad

More Telugu News