Sai Pallavi: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • వాలెంటైన్స్ డేకి 'లవ్ స్టోరీ' కానుక 
  • డిసెంబర్ నుంచి ప్రభాస్ కొత్త చిత్రం 
  • యంగ్ హీరోలకు తల్లిగా రమ్యకృష్ణ
 *  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రనిర్మాణం పూర్తికావచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 14న వాలెంటైన్స్ డే ను పురస్కరించుకుని చిత్రం నుంచి తొలి  పాటను రిలీజ్ చేయనున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే.
*  ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ తన తదుపరి చిత్రానికి ఓకే చెప్పాడు, కొరటాల శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ నుంచి జరుగుతుందని సమాచారం.
 *  నిన్నటితరం కథానాయిక రమ్యకృష్ణ ప్రస్తుతం ఇద్దరు యంగ్ హీరోలకు తల్లిగా నటించడానికి ఓకే చెప్పింది. వరుణ్ తేజ్ బాక్సర్ గా నటించే చిత్రంలోనూ, విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ రూపొందించే 'లైగర్' చిత్రంలోనూ కథానాయకులకు ఆమె తల్లిగా నటించనుంది.
Sai Pallavi
Shekhar Kammula
Prabhas
Koratala Shiva
Ramya Krishna

More Telugu News